మాయ మాటలతో మోసపోతే గోసపడతాం

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో లంబాడీలు ఆలోచించి ఓటు వేయాలని
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు రాంబల్ నాయక్ తెలిపారు.


భారతదేశానికి స్వాతంత్ర్యం 75 సంవత్సరాలు అయ్యింది. స్వతంత్రం వచ్చి ఇప్పటికీ లంబాడీలు, ఆదివాసీలు అంటే బానిసలుగానే చూస్తున్న రాజకీయ పార్టీలు, ఏ పార్టీ చూసినా ఏమున్నది గర్వకారణం ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే లంబాడీలు,ఆదివాసీలు లంబాడి తండాలు, ఆదివాసి గూడాలు గుర్తుకు వస్తాయి తప్ప వారిని మళ్లీ చూడాల్సిన అవసరం ఉండదు.

ప్రజలారా జాగ్రత్తగా ఆలోచించి మన తండ, గూడెం అభివృద్ధికి ఎవరైతే సహకరించారు? ఎవరైతే సహకరిస్తారో ? రేపు గెలిచినంక మన తండాగూడెం అభివృద్ధికి ఎవరైతే పాటుపడతారని మీరు నమ్ముతారో వారికే మీ అమూల్యమైన ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనితెలిపారు.

కొంతమంది, కొన్ని పార్టీలు నాయకులు, కొన్ని పార్టీల అభ్యర్థులు, వారు తప్పుడు హామీలతోని, తప్పుడు వాగ్దానాలతోని, ఇప్పుడైతే దాటని తర్వాత చూద్దాములే వీళ్లు ఏమైనా అడిగేది ఉందా? అనే ధోరణిలో చాలామంది నాయకులు ఉన్నారు. గిరిజన ప్రజలకు కనీస మర్యాద గౌరవం ఇవ్వకపోవడంతో మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఉదాహరణకు వెనకటికి ఇంటిలో దూలానికి ఉట్టి కట్టి ఉంటది పాలు ఉంటే ఆ పాలను పిల్లి వచ్చి కళ్ళు మూసుకొని ఆ పాలను తాగుతూ ఉంటది కానీ తను అనుకుంటదట నన్ను ఎవరు చూస్తలేరు, రాజకీయ నాయకుల ఆలోచనలు కూడా ఈ విధంగా ఉన్నాయి,

అందుకోసమే జాగ్రత్త జాగ్రత్తగామన తండా గూడెం అభివృద్ధి మన విద్యార్థుల చదువు కోసం తండాలకు గూడాలకు రోడ్లు, తండాలకు గూడాలకు విద్య సౌకర్యం, వైద్య సౌకర్యాలు మంచినీళ్లు సౌకర్యాలు అదేవిధంగా, కరెంటు సౌకర్యాలు రైతుల సమస్యలను పరిష్కరించే నాయకుల, దిక్కు మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. భారతదేశంలో బంజారాల ఆరాధ దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి, జల్ జమీన్ జంగల్ మా మన్యం వీరుడు కొమరం భీమ్ జయంతి వేడుకలను మనకు అధికారికంగా పరిచయం చేసింది ఎవరు?

మన తండాల్లో మన రాజ్యం/మా గూడెంలో మా రాజ్యం, మనకు స్వయం పాలన కావాలని మన తండాలను మన రాజ్యం వైపు నడిపి తండాలను గిరిజన గూడాలను ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలు గా ఏర్పాటు చేసినది ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు దాదాపుగా 33 తెగలను కలుపుకుంటే ఇంచుమించు పది శాతం పైన ఉన్నాం. ఇంతకుముందు ఉన్న ఆరు శాతం రిజర్వేషన్ను జనాభా దామాషా ప్రకారం 10% రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎవరో వస్తారు రకరకాల హామీలు ఇస్తారు చెప్పరాని మాటలు చెప్తారు మాయ మాటలతో మోసపోతే గోసపడతాం జాగ్రత్తగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులు గెలిచిన ఓడిన ఎవరు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులకే మనం చాలా జాగ్రత్తగా మన గిరిజన జాతికి ఉపయోగపడే నాయకులను పార్టీలను ఎన్ను ఉందాం ,

అని చెప్పి చెప్పి తెలియజేస్తూ మీరందరూ ఆలోచించి కంపల్సరిగా మే 13వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు అనేది మన బంగారు ఆయుధం ఓటు చాలా పవర్ఫుల్ ఓటు ద్వారానే ఏదైనా సాధించగలుగుతాం కాబట్టి సారాకు, కల్లుకు పైసలకు కాకుండా నిజంగా ఈ అభ్యర్థి మనకు మన వర్గాలకు మన గ్రామాల , తండాలు గూడాల అభివృద్ధికి ఉపయోగపడతారో అని అనుకుంటారో ఆ అభ్యర్థిని మీ అమూల్యమైన ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.. కేపీ

You may also like...

Translate »