కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ కోహెడ కలుపుతామనే మాట సాక్షాత్తు నేటి ముఖ్యమంత్రి తో

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ కోహెడ కలుపుతామనే మాట సాక్షాత్తు నేటి ముఖ్యమంత్రి తో పాటుగా స్థానిక ఎమ్మెల్యే మంత్రిగారైన పొన్నం అన్న మాటలు ఉట్టి మాటలేనా

జ్ఞాన తెలంగాణ
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం

ఆచరణలో పెట్టేది ఏమైనా ఉందా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాటలే గుర్తుచేసి అడిగిన బిజెపి మండల అధ్యక్షుడు ఖమ్మం వేంకటేశం

పత్రిక సమావేశంలో ఖమ్మం వేంకటేశం మాట్లాడుతూ… జిల్లాల పునర్విభజన సమయంలో కోహెడ హుస్నాబాద్ ప్రాంత ప్రజలు సిద్దిపేట జిల్లాలో కలవమని అఖిలపక్షం పార్టీల నేతృత్వంలో పెద్దఎత్తున ఉద్యమం చేపట్టిన అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా కరీంనగర్ జిల్లాలో ఉన్న కోహెడ హుస్నాబాద్ మండలాలు సిద్దిపేట జిల్లాలో బలవంతంగా కలుపుకొని ఈ ప్రాంత ప్రజలను అధికారులను రెండవ పౌరులుగా గుర్తించే రీతిలో సిద్దిపేట జిల్లాలో తయారుచేశారు

నాటి ప్రతిపక్ష పార్టీ నేటి అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ గార్లు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తిరిగి కరీంనగర్ జిల్లాలో కలుపుతామనే మాట పదేపదే చెప్పినప్పటికి నేడు అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తకుండా ఉండడం బాధాకరం

ఎన్నో శాఖలకు సంబంధించిన అధికారులతో పాటుగా కోర్టు వ్యవహారాలలో ఉన్న ప్రజలకు కోహెడ హుస్నాబాద్ మండలాలకు చెందిన వారు అంతకుముందు 35.కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్ లో అయ్యే పనులు నేడు సిద్దిపేట జిల్లాలో కలిసిన పాపానికి సంగారెడ్డి కి వెల్లవలిసిన పరిస్థితి ఏర్పడింది

ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పి కొత్త జిల్లాల ఏర్పటుతో ఈ ప్రాంతంలోనివారికి అందుబాటులో ఉండడం దేవుడెరుగు కానీ దూరం పెంచుకొవడంతో పాటుగా ప్రాంతీయేతురుడు అనే మాటను సిద్దిపేట జిల్లాలో మూటగట్టుకున్నమనే భావన ప్రతిఒక్కరిలో కలుగుతుంది

గతంలో పొన్నం ప్రభాకర్ చెప్పిన విధంగా కోహెడ హుస్నాబాద్ ప్రాంతాలను తిరిగి కరీంనగర్ జిల్లాలో కొనసాగేలా ప్రభుత్వం ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి స్థిరస్తాయిగా ఈ ప్రాంత ప్రజల మనోభావాలను తీర్చినవారిగా చరిత్రలో నిలవాలని మంత్రిగారికి ఆయన ఇచ్చిన మాటను గుర్తుచేసేందుకే ఈ పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు

పత్రిక సమావేశంలో బిజెపి మండల ప్రధానకార్యదర్శులు పిల్లి నర్సయ్య గౌడ్, జాలిగం రమేష్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు గుగ్గిళ్ల శ్రీనివాస్, బండ జగన్ యాదవ్, బిజెవైఎం మండల అధ్యక్షుడు కంది సత్యనారాయణ రెడ్డి, తదితరులున్నారు

You may also like...

Translate »