మద్యం తాగి కారు నడిపిన ఐఏఎస్ అధికారి..

కారుతో బైకును ఢీ కొట్టిన ఘటన

కేసు నమోదు చేసిన పోలీసులు

జ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్) మద్యం తాగి కారు నడిపి కారు బైకును ఢీ కొట్టిన ఘటన నల్ల కుంట పోలీస్ స్టేషన్ పరిధి లో వెలుగుచూసింది వివరాల్లోకి వెళితే ఈ నెల 18 న ఈ ఘటన జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అతి వేగంగా కారు నడిపి ఒక బైకును ఢీ కొట్టడమే కాకుండా నిలదీసిన వారి పై కూడా దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం తెలిపారు.ప్రమాదం జరిగిన సమయం లో కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ఈ ఘటన పై మే 18 న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.

You may also like...

Translate »