విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిని సహించను…

జ్ఞాన తెలంగాణ జనగామ ప్రతినిధు:
విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిని సహించను…..
పని చేయడం ఇష్టం లేని వెంటనే బదిలీ చెయించుకోండి….
నిజాయితీగా పని చేసే అధికారులను గౌరవిస్తాను….
నా నుండి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు….
మీరు కూడా ఏమి ఆశించకండి…..
పంచాయితీ రాజ్, ట్రైబల్ వెల్పేర్ అధికారుల సమీక్షా సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి,ఎమ్మెల్యే కడియం శ్రీహరి…..
జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పంచాయితీ రాజ్, ట్రైబల్ వెల్ఫెర్ అధికారులతో జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాష తో కలిసి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధి పనుల పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ….
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలో మండలాల వారీగా కొనసాగుతున్న అభివృద్ధి పనుల వివరాలను, కొత్తగా చేపట్టాల్సిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు పెండింగ్ లో ఉండడానికి గల కారణాలు ఏంటి….? వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనే విషయాలపై అధికారులతో చర్చించారు. అనంతరం నియోజకవర్గంలో ముఖ్యమైన లింక్ రోడ్ల నిర్మాణనికి సంబందించిన ప్రత్తిపాదనలు సిద్ధం చేయాలనీ అధికారులకు సూచించారు. నిర్మాణంలో ఉన్న గ్రామ పంచాయితీ భవనాలు వెంటనే పూర్తి చేయాలనీ అలాగే సీడిపి నిధుల నుండి చేపట్టిన పనులను సైతం వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు తిసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని పెండింగ్ పనులను 6నెలల్లోగా పూర్తి చేయాలనీ స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడిన ఘనపూర్ డివిజన్ లో సమీకృత డివిజనల్ కార్యాలయ సముదాయం మరియు కొత్తగా ఏర్పాటైన చిల్పూర్, వేలేరు మండలాలలో సమికృత మండల కార్యాలయ సముదాయం నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలనీ తెలిపారు. జనగామ, ఘనపూర్ లలో బంజారా భవన్ ల నిర్మాణానికి స్థల సేకరణ అలాగే గ్రామ పంచాయితీ భవనాల నిర్మాణానికి స్థలం లేని గ్రామాలలో స్థల సేకరణ చేపట్టాలని కలెక్టర్ ని కోరారు. అనంతరం అధికారులను ఉద్దేశించి నా నుండి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అలాగే నా పేరు చెప్పి ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వద్దని అన్నారు. మీరు కూడా ఎవరి దగ్గర డబ్బులు ఆశించవద్దని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారు, పని చేయడం ఇష్టం లేని వారు వెళ్లిపోవాలని, పని చేయని వారిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరించారు. నిజాయితీగా పని చేసే అధికారులను ఖచ్చితంగా గౌరవిస్తానని తెలిపారు. మీకు ఏవిధమైన ఇబ్బందులు ఎదురైనా వెంటనే నా దృష్టికి తీసుకురావాలని అన్నారు. అధికారులు ఎపటికప్పుడు నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. పనుల విషయంలో అలసత్వం వహించకుండా అధికారులు అందరూ సహకరించాలని, పరస్పర సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ జాయింట్ కలెక్టర్ పింకేష్ కుమార్, పీఆర్ ఎస్సి రఘువీర రెడ్డి, హన్మకొండ, జనగామ ఈఈలు వెంకటయ్య, చంద్రశేఖర్, డీఈలు, ఏఈలు, ఇతర పంచాయితీ రాజ్ శాఖ అధికారులు, ట్రైబల్ వెల్పేర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
