బీజేపీ ఎంపీలకు సన్మానించిన

అందెల శ్రీరాముల యాదవ్

ఈటల డీకే అరుణ నివాసాల్లో కలిసిన మహేశ్వరం నేతలు

జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం)

బీజేపీ ఎంపీ అభ్యర్థులుగా విజయదుంధిబి మోగించిన జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ను
మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ ఘనంగా సన్మానించారు.ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 8 ఎంపీ సీట్లు కైవసం చేసుకోవటం ప్రధాని నరేంద్ర మోడీజీ పనితననికి నిదర్శనమన్నారు.బీఆర్ఎస్ పతనం, కాంగ్రెస్ దిగజారుడు, ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయటంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలం కావడంతో ప్రజలకు ఆయా పార్టీలపై పూర్తి నమ్మకం పోయిందన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ అవతరిస్తుందన్నారు. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రధానిగా నరేంద్ర మోడీ అధికారం చేపట్టనున్నారని శ్రీరాములు యాదవ్ తెలిపారు.
ఈకార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కన్వీనర్ దేవేందర్ రెడ్డి, బడంగ్ పేట కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు పున్న భిక్షపతి, జంగారెడ్డి, ఢిల్లీ వెంకటేష్ తదితరులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

You may also like...

Translate »