గౌరవనీయులు డా.సవితా కబీర్ అంబేడ్కర్ 21 వ వర్థంతి.

గౌరవనీయులు డా.సవితా కబీర్ అంబేడ్కర్ 21 వ వర్థంతి.
–అరియ నాగసేన బోధి
M.A.,M.Phil.,TPT.,LL.B
ధమ్మ గురువు & న్యాయవాది
జ్ఞాన తెలంగాణ,డెస్క్:
రక్తహీనతతో రమాబాయి మరణాంతరం బాబాసాహెబ్ అంబేడ్కర్ తీవ్ర మనోవేదనకు లోనయ్యారు.1935 సంవత్సరంలో బాబాసాహెబ్ చాలా ఒంటరితనం అనుభవించారు. అంబేడ్కర్ ఆరోగ్యం కూడా క్షీణించసాగింది.ఇలాంటి పరిస్థితుల్లో కేరళకు చెందిన డాక్టర్ సవితా కబీర్ అనే మహిళతో పరిచయం ఏర్పడింది.డా.సవితా కబీర్ అంబేడ్కర్ కు వైద్య సేవలను అందించేవారు. వీరిద్దరి మధ్య స్నేహానురాగం ఏర్పడింది.
1948 ఏప్రిల్ 15 న ఉదయం డా.బి.ఆర్.అంబేడ్కర్ -డా.సవితా కబీర్ ను వివాహం చేసుకున్నారు.

అంబేడ్కర్ భార్య రమాబాయి రక్తహీనతతో 1935 మే 27 న మరణించింది. ఒకపక్క అంబేడ్కర్ గారి నలుగురు పిల్లలు, తన భార్య రమాబాయి మరణం చాలాకాలం అంబేడ్కర్ కు తీవ్ర మనో వేదనను కలిగించింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అంబేడ్కర్ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రజాపోరాటాలు కొనసాగించారు.రాజ్యాంగ రచనా సమయానికి అంబేడ్కర్ ఆరోగ్యం క్షీణించింది. అతిమూత్రం, కీళ్ళ నొప్పులతో సతమతమవుతున్న తరుణంలో తప్పనిసరి పరిస్థితుల్లో అంబేడ్కర్ కు మరొక తోడు తనను చూసుకొనేందుకు అవసరం అయింది.డా.బి.ఆర్.అంబేడ్కర్ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయనపై రాజ్యాంగ రచనా భారం పడింది. ఇలాంటి పరిస్థితుల్లో అంబేడ్కర్ ను చూసుకొనే వాళ్ళు లేరు.అంబేడ్కర్ సహచరుడు చిత్రే సలహా మేరకు తనను బాగా చూసుకుంటున్న డా.సవితా కబీర్ ను వివాహం చేసుకున్నారు.
ఢిల్లీలో కమీషనర్ కోర్టులో సివిల్ మ్యారేజ్ చట్టం ప్రకారండా.అంబేడ్కర్- డా. సవితా కబీర్ ల రిజిస్టర్ వివాహం జరిగింది. ఈ వివాహానికి 16 మంది హాజరయ్యారు.
డా.సవితా కబీర్ అంబేడ్కర్ వెంట నడిచారు. హిందూ మతాన్ని విడిచిపెట్టి బౌద్ధ మతాన్ని కూడా స్వీకరించారు.బాబాసాహెబ్ వెంట ఆమె ఉంటూ ఆయన ఆరోగ్యం చూసుకున్నారు.

అంబేడ్కర్ 1948 లో డా. సవితా కబీర్ ను పరిణయం చేసుకున్న నాటి నుండి డా.సవితా కబీర్ అంబేడ్కర్ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఆయన ఆశయాల సాధనకు సైతం తన సమయాన్ని కూడా కేటాయించింది.భారత రాజ్యాంగం రచనలో ఉండగా డా.సవితా కబీర్ అంబేడ్కర్ ను ఎంతగానో జాగ్రత్తగా చూసుకున్నారు.1956 అక్టోబర్ 14,15 తేదీలలో అంబేడ్కర్ తో పాటు తాను కూడా బౌద్ధ ధమ్మ దీక్ష స్వీకరించారు. విదేశాల్లో బౌద్ధం గురించి అధ్యయనం చేయడానికి, ప్రసంగాలు చేయడానికి అంబేడ్కర్ వెంట ఉన్నారు. ఆయన బాటలోనే ఆమె నడిచారు.
డా.సవితా కబీర్ 19౦9 వ సంవత్సరం జనవరి 27 వ తేదీన జన్మించారు.2003 మే 29 న కాలం చేశారు. ప్రజ్ఞాసూర్యుడు, అనంతమైన జ్ఞాన వృక్షం డా.బి.ఆర్.అంబేడ్కర్ నీడలో ఉంటూ ప్రతి విషయంలోనూ అంబేడ్కర్ కు మద్దతుగా నిలిచారు మైసాహెబ్.
అంబేడ్కర్ ఆరోగ్యం క్షీణించిన దశలో డా.సవితా కబీర్ అంబేడ్కర్ ఆరోగ్యాన్ని కాపాడుట కోసం పీడితుల విముక్తి కోసం అంబేడ్కర్ కు తన పూర్తి మద్దతును ఇచ్చిన మంచి మనసున్న తల్లి డా.సవితా కబీర్.

డా.సవితా కబీర్ కు అంబేడ్కర్ అంటే అపారమైన ప్రేమ, గౌరవం.అందుకే ఆమె అంబేడ్కర్ ను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. అనారోగ్యంతో ఉన్న అంబేడ్కర్ కు ఎనలేని సేవలను అందించారు.
డా.సవితా కబీర్ ఇలా ఆవేదనను వ్యక్తం చేశారు “బాబాసాహెబ్‌ని కలవడానికి వచ్చేవారిపై నేను ఆంక్షలు పెట్టేదానిని, తద్వారా అతను విశ్రాంతి తీసుకోవడానికి మరియు మానసిక ఆరోగ్యం పొందాలని, దీనివల్ల కొంతమందికి నాపై కోపం వచ్చింది, కానీ దానికి నివారణ లేదు. ఎందుకంటే నేను బాబాసాహెబ్ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలనుకున్నాను. ఆయనను పరామర్శించిన చాలా మంది నాయకులు, అనుచరులు, కార్యకర్తలు ఎవరైనా ఉన్నారు.ఎప్పుడూ పనితో వస్తుండేవారు.అలాగే ఎప్పుడైనా వచ్చి గంటల తరబడి కూర్చునేవారు.అలా చాలాసార్లు ఎంతోమందిని వెనక్కి పంపాల్సి వచ్చింది. అప్పటికే తన అనుచరులు ఎవరైనా ఏదైనా సమస్యల ఫిర్యాదులతో వస్తే సాహెబ్ అశాంతి చెందేవాడు.శారీరకంగా వికలాంగుడు కావడంతో అశాంతి చెందేవాడు..కానీ ఇతరులకు ఆ విషయం తెలియలేదు.అందువల్ల నేను బాధను భరించాల్సి వచ్చింది. సాహెబ్ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనేది నా ఉద్ధేశం..”



డా.సవితా కబీర్ కు వినయపూర్వక నివాళులు..💐💐💐