ఉన్నత విద్య-ఉపాధి అవకాశాలు-అవగాహనా

ఉన్నత విద్య-ఉపాధి అవకాశాలు-అవగాహనా
జ్ఞాన తెలంగాణ
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూర్ స్వేరో సర్కిల్ వారు వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్న ఉన్నత విద్య-ఉపాధి అవకాశాలు-అవగాహనా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు (ఆదివారం) తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు కర్రోల సత్యం గారు పాల్గొని సర్కిల్ విద్యార్థులతో సంభాషించడం జరిగింది.
విద్యార్థులను ఉద్దేశిస్తూ భవిష్యత్ లో ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే చదువు ఒక్కటే మార్గం…
ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కూడా విద్యను ఆపొద్దు అని చెప్పారు.
విద్యార్థుల నైపుణ్యాన్ని పరీక్షిస్తూ బాగా చదువుకొని గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న మేధావులను,ఉద్యోగస్థుల జీవిత ఘట్టలను వివరిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించారు.
తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ గౌలిదొడ్డి గురుకుల పాఠశాల COE లో సీటు వచ్చిన చైతన్య మహావీర్ స్వేరోను అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో లింగం స్వేరో, సొంటే ఎల్లయ్య,జవొజీ శేఖర్ యాదవ్,మాల సుధాకర్, కడుపు మల్లేష్, రమేష్,కుమార్,మల్లేష్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు…