ములుగు జిల్లాలో భారీ వర్షాలు

  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
  • ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్.పి ఐపిఎస్

ములుగు ప్రతినిధి ఆగస్టు 18 (జ్ఞాన తెలంగాణ) :
రాష్ట్రంలో భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో మరియు ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలలో మరియు గోదావరి పరివాహక ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్.పి ఐపిఎస్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.ఈ సందర్బంగా వరద ప్రవాహం ఉన్న వంతెనలు,కల్వర్ట్, రహదారులపై నుండి ప్రజలు దాటవద్దని, శిధిల వ్యవస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండద్దని, తడిగా ఉన్న కరెంట్ పోల్స్, ట్రాన్సఫర్స్ తాకవద్దని గ్రామాల లో చేపల వేటకు ఎవరు వెళ్ళవద్దని మరియు అత్యవ సరమైతే తప్ప ప్రజ లు ఎవరు బయట రావద్దని వరద ప్రవాహల వద్ద బందోబస్త్ ఉన్న పోలీస్ సిబ్బంది సూచనలు పాటించి పోలీసు వారికి సహకరించాలని సూచించారు.అదే విధంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని వాగులు, చెరువులు,కుంటల యొక్క పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాల ని ముంపు ప్రాంతా లను ముందుగానే గుర్తించి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధి కారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్బంగా జిల్లా పోలీస్ యంత్రాం గాన్ని అప్రమత్తం చేసినట్లు ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైన వాటిని ఎదుర్కొనేందుకు జిల్లా పోలీస్ శాఖ సంసిద్ధంగా ఉందని ముంపు ప్రాంతాల ప్రజలకు తక్షిణ సహాయం కోసం *రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు (SDRF) జిల్లా విపత్తు ప్రతిస్పందన దళాలు (DDRF) బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది అని తెలి యచేశారు.విపత్కర పరిస్థితులు ఎదురైతే ప్రజలు పోలీస్ శాఖ సహాయం తీసుకోవా లని Dail 100 ని సద్వినియోగం చేసు కోవాలని ఈ సంద ర్భంగా తెలియజే శారు.

You may also like...

Translate »