బరువుకు మించి ప్రయాణం ప్రమాదకరం ….గుర్తుంచుకోవాలి
బరువుకు మించి ప్రయాణం ప్రమాదకరం ….గుర్తుంచుకోవాలి
జాతీయ రహదారి వెంట అధిక లొడుతో ట్రక్కు

జ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్) బరువుకు మించి ప్రయాణం ప్రమాదకరం అని గుర్తుంచుకోవాలి.ట్రాలీలు ఆటోలు లారీలు ఇలా పలు వాహనాలు అధిక బరువులు అధిక లోడు తో ప్రధాన రహదారుల వెంట ప్రయాణం కొనసాగిస్తున్న పట్టించుకునే వారే కరువయ్యారు.
అధిక లోడు ప్రయాణం చాలా ప్రమాద కరం తమ వాహణానికే కాదు తన వెంట వస్తున్న ఇతర వాహనాలకు కూడా ప్రమాదమే అని గుర్తించాలి ఇలాంటి అధిక లోడు తో ఉన్న వాహనాలు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కోకొల్లలు కాబట్టి వాహనదారులు తమ వాహనం లో అధిక లోడు తో ప్రమాద కరంగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటే సుఖవంతమైన ప్రయాణం మనకే కాదు మనతో వచ్చే ఇతర ప్రయాణికులకు కూడా ప్రయాణం తమ గమ్య స్థానాలకు చేరుకోవాలన్న దే మన విన్నపం ఐతే సోమవారం జుపార్కు జాతీయ రహదారి పై ట్రాలీలో అధిక లోడు తో ప్రమాదకరం గా ప్రయాణిస్తున్న ట్రాలి దృశ్యాన్ని కెమరాలో బంధించిన జ్ఞాన తెలంగాణ రిపోర్టర్.