ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థాన శుభాకాంక్షలు 


– రత్నం నాని, జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి ప్రతినిధి


ప్రియమైన మానవ సోదర సోదరీమణులారా,
ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థాన దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శాంతి, ఆనందం, ఆశతో నిండిన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

యేసు శిలువపై చేసిన త్యాగం, మానవాళిపై ఆయనకు ఉన్న అపారమైన ప్రేమకు నిదర్శనం. ఆయన తన ప్రాణాలను అర్పించిన క్షణం, చీకటి నిండిన ప్రపంచంలో వెలుగు పుట్టిన క్షణం. కానీ, మరణమే అంతిమం కాదు అని ఆయన మూడవ దినం పునరుత్థానంతో స్పష్టం చేశారు. ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, సమస్త మానవాళికీ శాశ్వత ఆశను అందించే ఘట్టం.

ఆయన మృత్యువుపై గెలిచారు – మన కోసం! ఆయన పునరుత్థానం ద్వారా మన జీవితం అర్థవంతంగా మారింది. మనం ఏ స్థితిలో ఉన్నా, మన జీవితం నిస్సారంగా అనిపించినా, ఆయన్ను ఆశ్రయించినవారికి నూతన ప్రారంభం ఉంటుంది. అదే ఆయన ఇచ్చిన వాగ్ధానం.

ఈ పవిత్ర దినాన, మన హృదయాలను ఆయన ప్రేమతో నింపుకుందాం. పునరుత్థిత క్రీస్తు మనకు శాంతిని, శక్తిని, శాశ్వతమైన ఆశను కలిగించును. ఆయన జీవించే ఉన్నారు – మనలో, మన కోసం, ఎప్పటికీ.

ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థాన శుభాకాంక్షలు!
అయ్యోచేతిలో జీవితం ఉంది. ఆయనను ఆశ్రయించండి – జీవించండి.


– రత్నం నాని
జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి ప్రతినిధి

You may also like...

Translate »