కొత్తూరు మండల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

- కొత్తూరు మాజీ ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి
జ్ఞాన తెలంగాణ,కొత్తూరు,షాద్ నగర్ ప్రతినిధి, ఆగస్టు 27:
విఘ్నేశ్వరుడు మన అందరి జీవితాల్లో విఘ్నాలను తొలగించి ఆనందం సుఖసంతోషాలు అభివృద్ధి నింపాలని ఈ పర్వదినం మనందరికీ ఐక్యత సమానత్వం సద్భావనల పండుగగా నిలవాలి గణేశుడు అందరికీ ఆరోగ్యం ఐశ్వర్యం ప్రసాదించాలి అలాగే ఆయన రాష్ట్రంలోని ప్రజలంతా పర్యావరణానికి హాని కలగకుండా మట్టి గణపతులను ఉపయోగించి పండుగను జరుపుకోవాలని సూచించారు. మనం భవిష్యత్తు తరాల కోసం ప్రకృతిని కాపాడే బాధ్యత వహించాలి అందుకే పచ్చదనం కోసం ప్రకృతి సంరక్షణ కోసం పర్యావరణహితమైన ఉత్సవాలు జరుపుదాం అని ఆయన అన్నారు.