ఘనంగా బుద్ధ జయంతి.

ఘనంగా బుద్ధ జయంతి.
ఫోటో. ఖాజాపూర్ గ్రామంలో బుద్ధ జయంతి చేస్తున్న గ్రామస్తులు.
జ్ఞాన తెలంగాణ – బోధన్
గౌతమ బుద్ధుని జయంతి, బుద్ధ పూర్ణిమ సందర్భంగా సాలుర మండలం ఖాజాపూర్ గ్రామంలో గ్రామస్తులు బుద్ధపూర్ణిమ జయంతిని ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా బుద్ధుని ప్రతిమకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ బుద్ధుని బోధనలు సర్వ సర్వమానవాళికి ఎంతో శ్రేష్టమని వాటిని ప్రతి ఒక్కరు అనుసరించాలని సూచించారు. అనంతరం గ్రామస్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యులు భీమ్ రావ్ , అంబేద్కర్ సంఘ అధ్యక్షులు ప్రవీణ్,ఉపాధ్యక్షులు విఠల్, కార్యదర్శి రాములు , ప్రధాన కార్యదర్శి సయ్యాజీ, కోశదికారి నితిన్ , సంఘ సభ్యులు పాల్గొన్నారు.
