ఘనంగా శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ జన్మదిన వేడుకలు

ఘనంగా శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ జన్మదిన వేడుకలు
జ్ఞాన తెలంగాణ కేసముద్రం
మే 26.
కేసముద్రం రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఆదివారం నాడు పూజ్య స్వామీజీ జన్మదిన వేడుకలను జ్యోతి ప్రజ్వలనతోకార్యక్రమం ప్రారంభించారు.
అవధూత దత్త పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 82 వ జన్మదిన దినోత్సవంను, దత్త హ్యూమన్ సర్వీసెస్ వాలంటీర్లు మరియు దత్త భక్తుల, ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 200 మంది కి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో. వెలిశాల దయానంద్, యు ఏకాంతం, కొప్పుల శంకర్, లేగల విజయభాస్కర్ రెడ్డి, యు వంశీ, గుగులోతు మోహన్, గుగులోతు విజయ్, శ్రీను, వీరన్న, భాస్కర్, రాజు, రాజేష్, విశ్వేశ్వర్, యాకయ్య, సోమేశ్వర్, తదితరు దత్త భక్తులు పాల్గొన్నారు.