ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ప్రొజెక్టర్ విరాళం ఇచ్చిన గ్రీన్ కో జిలేష్ సోలార్ పవర్ ప్లాంట్

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ప్రొజెక్టర్ విరాళం ఇచ్చిన గ్రీన్ కో జిలేష్ సోలార్ పవర్ ప్లాంట్
జ్ఞాన తెలంగాణ కొడకండ్ల తేదీ: 13-06-2024 ఈరోజు కొడకండ్ల మండల కేంద్రంలోని సోలార్ పవర్ ప్లాంట్ వారు ప్రభుత్వ పాఠశాలకు తమ వంతుగా ప్రొజెక్టర్ ను బహుమతిగా అందించి తాము విద్యార్థుల పట్ల మక్కువ చూపినారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎంతో తెలివిగలవారు అని గుర్తించి వారికి ఒక నైపుణ్యాన్ని గుర్తించి వారి ప్రతిభను వెలికి తీసేందుకు తమ వంతుగా ఒక నూతన. ప్రొజెక్టర్ ను అందజేసి విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సంకల్పంతో మేము ఈ స్కూల్ కి మా వంతుగా ఒక చిన్న ప్రొజెక్టర్ అందజేయడం జరిగింది. వారికి పాఠశాల ల యాజమాన్యం తరపున మరియు తల్లిదండ్రుల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.