ఘనంగా పదవి విరమణ వీడ్కోలు సన్మాన కార్యక్రమం:

ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్యప్రకాష్


జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:

జఫర్ గఢ్ మండలంలోని జఫర్ గఢ్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసి బుధవారం రోజున లాతకుల.యాకుబ్ రెడ్డి పదవి విరమణ చేశారు.ఈ కార్యక్రమము స్థానిక ఎస్ ఐ రవియాదవ్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వర్ధన్నపేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య ప్రకాష్ పాల్గొని ప్రసంగించారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగ కాల పరిమితి వరకు ఉద్యోగం చేసి ఉద్యోగ విరమణ పొందాల్సిందే అని అన్నారు.ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు సీనియర్ల సలహాలు,సూచనలు పాటిస్తూ ఆదర్శంగా నిలబడాలని అని అన్నారు,వారి శేష జీవితం సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో గడపాలని కోరారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఏఎస్ఐ.లు వెంకట.నారాయణ,రాజమౌళి. ముసలయ్య ,కానిస్టేబులు కృష్ణ మూర్తి,వీరన్న,అశోక్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »