జనవరి 31 జ్ఞాన తెలంగాణ వర్ని… (మోస్రా)మండల కేంద్రంలోని భాషి కాలనీ లో ఖాళీగా ఉన్న స్టలాలాను బాన్స్ వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. స్టలం లేని మహిళలు తమకు స్టలం ఇవ్వాలని కోరిన్నారు. ఇండ్లు లేని పేద ప్రజలకు వారంలోగా స్టలాలను పంపిణి చేయాలనీ తహసీల్దార్ కు తెలిపారు. స్టలాలను పంపిణి చెసిన వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చెస్తానని అయన పేద ప్రజలకు హామీ ఇచ్చారు. త్వరగా గ్రామంలో ప్రభుత్వ అధికారులు పెదాలను గుర్తించి, అందులో స్టలం లేని వారికి స్టలం ఇచ్చేలా సర్వేను వేగవంతం చేయాలనీ తహసీల్దార్ సిబ్బంది కి, స్థానిక ప్రజా ప్రతినిధులకు తెలిపారు. అందుకు పేద మహిళలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ లక్ష్మణ్, మాజీ రైతు సామానవ్య సమితి అధ్యక్షులు పిట్ల శ్రీరాములు,తదితరులు ఉన్నారు