అగ్రికల్చర్ యూనివర్సిటీ కి రానున్న గవర్నర్

అగ్రికల్చర్ యూనివర్సిటీ కి రానున్న గవర్నర్
జ్ఞాన తెలంగాణ
రాజేంద్ర నగర్ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో “ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆరవ స్నాతకోత్సవం జూన్ 10 వ తేదీ సోమవారం జరగనుంది. రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియం లో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి, ఏపీఈ, పి జె టి ఎస్ ఏ యు ఇన్చార్జి ఉపకులపతి ఎం. రఘునందన్ రావు తెలిపారు. తెలంగాణ గవర్నర్, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, విశ్వవిద్యాలయ కులపతి సిపి రాధాకృష్ణన్ అధ్యక్షతన ఈ స్నాతకోత్సవం జరుగుతుందని, భారతీయ స్టేట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ చెల్లా శ్రీనివాసులు శెట్టి ముఖ్యఅతిథిగా పాల్గొని స్నాతకోత్సవ ప్రసంగం చేయనున్నారని రఘునందన్ రావు వివరించారు. 587 విద్యార్థులకు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను, 165 మంది విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలని అందజేయనున్నట్లు తెలిపారు. 11 మంది పిజి, పిహెచ్డి విద్యార్థులు, 8 మంది యూజీ విద్యార్థులు బంగారు పథకాలు పొందనున్నారని రఘునందన్ రావు పేర్కొన్నారు.”