చెరువులా తలపిస్తున్న గొల్లూరు నాగిరెడ్డిపల్లి రోడ్డు

చెరువులా తలపిస్తున్న గొల్లూరు నాగిరెడ్డిపల్లి రోడ్డు
ఈ రోడ్డు ప్రజా ప్రతినిధులకు అధికారులకు కనిపించడం లేదా..
ఎందరో ప్రజాప్రతినిధులు మారుతున్న ఈ రోడ్డు మరదా
తక్షణమే ఈ రోడ్డు సమస్యను పరిష్కారం చేయాలి
జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం గొల్లూర్, నాగిరెడ్డిపల్లి పులిమకం, వేకన్నగూడం,గ్రామాల ప్రజల నిత్యం, వెంకన్న గూడ నుండి ముచ్చింతల్ వెళ్ళడానికి ప్రతిరోజు ప్రయాణం చేస్తూ ఉంటారు రైతులకు,స్కూల్ పిల్లలు జేమ్స్ హాస్పిటల్ కు వెళ్లే వారికి నిత్యం చాల సమస్య అవుతుందని గత 20 సంవత్సరల నుండి రాజకీయ నాయకులకు, అధికారులకు చాలా సార్లు విన్నమించిన ఎవరు పట్టించుకోలేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వర్షానికి రోడ్డు చెరువులా మారిందని ఎందరో ప్రజాప్రతినిధులు మారిన రోడ్డు మాత్రం మారడం లేదని నిత్యం ప్రయాణిస్తున్న అధికారులు నాయకులకు ఈ రోడ్డు కనిపించడం లేదా అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు తక్షణమే ఈ రోడ్డు సమస్యను పరిష్కారం చేయాలని వారు కోరారు.రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.