పసిడికి మార్కెట్లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే పసిడి ధరలు గత కొంత కాలం నుంచి పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. జూన్ నెల ప్రారంభంలోనే భారతదేశంలో బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగాయి. ఉక్రెయిన్, రష్యా మధ్య పెరిగిన ఉద్రిక్తతలు అలాగే యుఎస్-చైనా 90 రోజుల కాల్పుల విరమణతో మార్కెట్ అంతటా పసుపు లోహాలను పెంచింది. ఈ క్రమంలో మంగళవారం కూడా బంగారం స్వల్పంగా పెరిగింది.
భారతదేశంలో బంగారం ధరలు :
ప్రస్తుతం 100 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లు రూ.9,88,400, 22 క్యారెట్లు రూ.9,06,000, 18 క్యారెట్లు రూ.7,41,300గా ఉంది. అదే సమయంలో, 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లు రూ.98,840, 22 క్యారెట్లు రూ.90,600, 18 క్యారెట్లు రూ.74,130గా ఉన్నాయి.
హైదరాబాద్‌లో బంగారం ధరలు..
నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,850, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90,610.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 74,140గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, విజయవాడలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి
దేశవ్యాప్తంగా బంగారం (22, 24 క్యారెట్ల) ధరలు ఎలా ఉన్నాయంటే..