GO NO 276 ఈ విద్యా సంవత్సరానికి రద్దు చేయాలి.

TRTF రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జామ కుషాల్
2024-25 సంవత్సరం పదో తరగతివిద్యార్థులకు 276 జీవో తో కొత్త పరీక్షవిధానాన్ని తీసుకురావడం జరి గింది.దానినిఅమలు పరచరాదని పాతవిధానాన్ని కొనసాగించాలని టిఆర్టిఎఫ్ రంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు కొమ్మ లోకేశ్వర్ ప్రధాన కార్యదర్శి జామ కుషాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ విధానం వచ్చే విద్య సంవత్సరం అనగా 2025-26 నుండి అమలు చేయాలి. నూతనవిధానంలో పేపర్ విధానాన్ని మారుస్తూ తీసుకువచ్చిన విదానం ప్రకారం ఇంటర్నల్ మార్క్స్ 20ని తొలగిస్తూ ప్రభుత్వముజీవో విడుదల చేయడం జరిగింది.వంద మార్కులకు క్వశ్చన్ పేపర్ ఉంటుందని తెలియజేయడం జరిగింది. కానీ 70% విద్యసంవత్సరం పూర్తయిన తరుణంలో ఈ కొత్త విధానాన్ని ప్రవేశపె ట్టడం ద్వారా పదవ తరగతి విద్యార్థులు అయోమయం కు గురి అయ్యే అవ కాశం ఉంటుంది కావున ప్రభుత్వము పునరాలోచించి పాత విధానాన్ని కొన సాగించాలని కోరారు పదవ తరగతి విద్యార్థులు ఇప్పటికే పరీక్ష విధానంపై పూర్తి అవగాహన కలిగి ఉన్నారని కొత్త విధానంతో మళ్లీ అవగాహన చేసుకో వడం ఆలస్యమవుతుందని వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ కావడం కష్టమవు తుందనితెలిపారు.కావున ప్రభుత్వముపునరాలోచించి ఈవిద్యాసంవత్సరా నికి పాత విధానమే కొనసాగించాలని కోరారు.
