జూన్ 1 న గిద్దెగళం-ఏపూరి ఆట ఆత్మగౌరవ వర్క్​షాప్​

–హైదరాబాద్ లో నిర్వహణ

  • ఏపూరి సోమన్న, గిద్దెరామ్ నర్సయ్య

జ్ఞాన తెలంగాణ, భువనగిరి:
భువనగిరిలో వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగతో ప్రముఖ కవి గాయకులు ఏపూరి సోమన్న, గిద్దె రాంనర్సయ్య లు ప్రత్యేక సమావేశం అయ్యారు. జులై 7న మాదిగల పీడిత వర్గాల ఆత్మగౌరవ పథాక (మాదిగ దండోరా), మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30వ ఆవిర్భావ వేడుకలు అంబరాన్నంటేలా చాటి జయప్రదం చేయడం కోసం జూన్ 1న మాదిగ, కవులు,కళాకారుల,రచయితల మేధావుల, సాంస్కృతిక వాదుల గిద్దె గళం – ఏపూరి ఆట ఆత్మగౌరవ వర్క్ షాప్ హైదరాబాద్ లో నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులు గా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ప్రొఫెసర్​ కాసిం ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి కవులు, కళాకారులు, మేధావులు, రచయిత లు,సాంస్కృతిక వాదులు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

You may also like...

Translate »