జఫర్ గఢ్ మండల ఎస్సి సెల్ అధ్యక్షుడి గా గంగదారి. యాదగిరి ఎన్నిక:

జఫర్ గఢ్ మండల ఎస్సి సెల్ అధ్యక్షుడి గా గంగదారి. యాదగిరి ఎన్నిక:
జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:
జఫర్ గఢ్ మండలంలోని ఉప్పుగల్ గ్రామానికి చెందిన గంగదారి.యాదగిరి ని స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీమతి.సింగపురం.ఇందిర ఎన్నికైనట్లు నియామక పత్రాన్ని అందచేసి ప్రకటించారని తెలిపారు.
ఇందిర మాట్లాడుతూ గత పార్టీ కోసం సంవత్సరాలుగా కష్ట పడుతూ ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను పార్టీ గుర్తించి తగిన సమయంలో తగిన న్యాయం చేస్తుంది అని అన్నారు.ప్రజా పాలన కోసం ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదల అందరికి అందే విధంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ కృషి చేయాలని అన్నారు. పార్టీకి నా సేవలను గుర్తించి నాకు మండల ఎస్సి సెల్ అధ్యక్షుడు గా బాధ్యతలు కట్టబెట్టిన సింగపురం. ఇందిర కు మరియు నాకు ఈ పదవి రావడానికి సహాయ సహకారాలు అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకుల కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈకార్య క్రమంలో కాంగ్రెస్ పార్టీ , జిల్లా,మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.