బహిరంగ సభల పేరుతో పిల్లల స్కూల్స్ బంద్ చేసి పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్న టిఆర్ఎస్ ప్రభుత్వం బిఎస్పీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు ఎంసీ కేశవ్ రావ్

ఉండవెల్లి (అలంపూర్ చౌరస్తా) : బహిరంగ సభల పేరుతో పాఠశాలలు బందు చేసి స్కూల్ బస్సులను బహిరంగ సభలకు తరలిస్తున్న దుస్థితి అలంపూర్ నియోజకవర్గం లో ఉందని,పిల్లలు స్కూల్స్ బంద్ చేయడం ఎంతో దుర్మార్గమని ఈరోజు అలంపూర్ చౌరస్తా బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ నోట్ నిర్వహించి మాట్లాడారు.
ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు ఎం సి కేశవ్ రావు గారు మాట్లాడుతూ కొల్లాపూర్ బహిరంగ సభ బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికి ముఖ్యఅతిథిగా సీఎం కేసీఆర్ గారు రావడం అందరికీ సంతోషమే కానీ అలంపూర్ నియోజకవర్గం నుండి మీటింగ్ కు వెళ్లడానికి స్కూల్ బస్సులు పెడుతున్నారు. స్కూల్ బస్సులు వెళ్లిపోవడంతో పిల్లలను తరించడానికి బస్సులు లేక స్కూల్ లను బందు పెట్టారు. ఇది ఎంతో దుర్మార్గమైన చర్య అని జిల్లా అధ్యక్షులు కేశవ్ రావు,మండల అధ్యక్షులు ప్రభుదాసు, మండల ముస్లిం మైనారిటీ కన్వీనర్ షేక్ షాహిన్ వారు మాట్లాడుతూ అలంపూర్ నియోజకవర్గంలో విద్యా వ్యవస్థ మీద ఈ ప్రభుత్వం ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు పైగా వారి బహిరంగ సభలకు స్కూల్స్ బంద్ చేసి మరి స్కూల్ బస్సులు తీసుకుపోవడం ఇలా పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. విద్యకు ప్రాధాన్యత ఇచ్చే ఏకైక పార్టీ బిఎస్పీ డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారని వారు తెలియజేశారు. గద్వాల జిల్లా దేశంలోనే విద్య వ్యవస్థల వెనుకబడి ఉన్నది.ఇంకెప్పుడు విద్యా వ్యవస్థలో ఈ అలంపూర్ బాగుపడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పాలకులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉండవెల్లి నాయకులు వెంకటేశ్వర్లు, మండల సెక్రెటరీ శివ,ఖాజా వళి తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »