గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న


బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని 31వ డివిజన్ లక్ష్మి నగర్ లో లోక్ సభ ఎన్నికల్లో భాగంగా చేవెళ్ళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా. గడ్డం రంజిత్ రెడ్డి కి మద్దతుగా కాలనీ వాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, చంద్ర పాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రాకేష్, భాస్కర్ రెడ్డి, గిరి ముదిరాజ్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »