పంచాయతీ కార్యదర్శి నుండి ఆసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 30 :
గ్రూప్-2 ఫలితాల్లో మండలంలోని మునుకుంట్ల గ్రామపంచాయతీ పరిధిలోని అక్కలాయిగూడెంకు చెందిన వెల్మకంటి వేణు జనరల్ అడ్మిసిస్ట్రేషన్(జీడీఏ)లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా ఎంపికైయ్యాడు. వేణు ప్రస్తుతం చండూరు మండలంలో గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. వేణు 2019లో తొలి ప్రయత్నంలోనే పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించాడు. అయినా పట్టువీడక పరీక్షలకు సిద్ధమవడంతో గ్రూప్-2 ఫలితాల్లో 231 ర్యాంకు పొంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా ఎంపికయ్యాడు. ఇతనిధి వ్యవసాయ కుటుంబం తల్లి జయమ్మ అనారోగ్యంతో మృతిచెందింది.