తోటి మిత్రురాలుకి ఆర్థిక సహాయం అందుచేసిన స్నేహితులు

తోటి మిత్రురాలుకి ఆర్థిక సహాయం అందుచేసిన స్నేహితులు
జ్ఞానతెలంగాణ, చిట్యాల, జూన్ 09:
చిట్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న తోటి స్నేహితురాలు చిట్యాల మండలం గిద్దేముత్తారం గ్రామానికి చెందిన కనకం కళ్యాణి వాళ్ళ నాన్న క్రీ,శే”కనకం ఓదెలు ఇటీవల అనారోగ్యం తో మృతి చెందగా వారి కుటుంబం ని 2009-10 సంవత్సరానికి చెందిన స్నేహితులు పరామర్శించి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం మరియు 50 కేజీల బియ్యం అందచేసి తమ ఔదర్యం ని చాటుకున్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మాతో 10 సంవత్సరాలపాటు చదువుకున్న కళ్యాణి మధ్యలోనే నాన్న ని కోల్పోవడం చాలా బాధాకరం అని వారి కుటుంబం కి మా స్నేహితులు ఎల్లపుడు చేదోడు వాదోడు గా ఉంటారు అని తెలిపారు. ఈ కార్యక్రమం లో 2009-10 స్నేహితులు మాసు రమేష్, పుల్ల సందీప్, కట్కూరి రాజేందర్, గిన్నారపు సతీష్ తదితరులు పాల్గొన్నారు.
