మిత్రులారా జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు కోట్ల బహుజన ప్రజలకు

జ్ఞాన తెలంగాణ, న్యూస్. నారాయణఖేడ్ :

మిత్రులారా జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు కోట్ల బహుజన ప్రజలకు ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మత మైనార్టీ సోదరులకు క్రైస్తవ సోదరులకు అణగారిన వర్గాలకు ఆగ్రకుల స్తులోని పేదలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం ఎంతోమంది విద్యార్థులు బలిదానాలతోని తెలంగాణ ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పడితే అదే తెలంగాణ 10 సంవత్సరాలు వెలమదొరల ఆధిపత్యం కొనసాగింది మరి పది సంవత్సరాల తర్వాత రెడ్డి దొరల తెలంగాణగా ఏర్పడ్డది అధికార మార్పిడే జరిగిందే తప్ప ఏ మార్పు జరగలేదు అందుకని బిజెపి కాంగ్రెస్ టిఆర్ఎస్ ఈ పార్టీలన్నీ జెండాలు వేరైనా ఎజెండా మాత్రం ఒకటే ఉంటుంది ఈ పార్టీలన్నీ మనువాద సిద్ధాంతం తోని నడుస్తున్నాయి వీటిని తరిమి కొట్టాలంటే ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని ముఖ్యంగా మెజార్టీ ప్రజలందరూ శ్రమ చేసే ప్రజలందరూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ప్రతి ఒక్కరూ రాజకీయ చైతన్యం కావలసిన సమయం ఆసన్నమైంది సామాజిక స్పృహ కలిగి ఉండాలి ఈ దేశంలో అణగారిన వర్గాల కోసం ఏ మహానుభావులు త్యాగం చేశారు అనేది తెలుసుకుంటే తప్ప ఈ సమాజం బాగుపడే పరిస్థితి లేవు అందువలన దయచేసి బుద్ధుడు నుంచి మహాత్మ జ్యోతిబాపూలే పెరియర్ నాయకర్ నారాయణ గురు చత్రపతి సాహు మహారాజ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మానేవర్ కాన్సిరాం వీరి యొక్క జీవిత చరిత్ర వాళ్ళ యొక్క త్యాగం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే బహుజన రాజ్యం సాధ్యమవుతుందని బహుజన సమాజ్ పార్టీ నారాయణఖేడ్ అసెంబ్లీ ఇంచార్జ్ మలిగదొడ్డి పండరి గారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

You may also like...

Translate »