మంఖల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

మంఖల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
కొండేటి సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ ఆధ్వర్యంలో
మంఖల్ లో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన
మున్సిపల్ కౌన్సిలర్లు బాకి విలాస్
బూడిద తేజస్విని శ్రీకాంత్ గౌడ్
మహేశ్వరం, జ్ఞాన తెలంగాణ
మంఖల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మున్సిపల్ కౌన్సిలర్లు బాకి విలాస్,బూడిద తేజస్విని శ్రీకాంత్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపల్ మంఖల్ గ్రామంలో మున్సిపల్ వార్డు కార్యాలయంలో ఆదివారం నాడు కొండేటి సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని మున్సిపల్ కౌన్సిలర్లు బాకి విలాస్,బూడిద తేజస్విని శ్రీకాంత్ గౌడ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంఖల్ ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని కొండేటి సూపర్ స్పెషాలిటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పేద ప్రజలకు సామాన్య ప్రజలకు అందుబాటులో వైద్యం అందిస్తూ అందరి ఆదరణ పొందుతూ పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని కోరారు. దాదాపు 300 మంది రోజులకు ఉచితంగా బీపీ షుగర్ చెక్ అప్ చేసి ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరిగిందని వైద్య బృందం తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు యాదయ్య, డా॥ ప్రమోద్ కుమార్ జనరల్ ఫిజీషియన్,డా॥ సౌమ్య శ్రీ, డాక్టర్ ఎంబిబిఎస్,ఎమ్మెస్ ఓబిజి,జి వై ఎన్,ఉస్మానియా, డా దీప్తి ఎంబిబిఎస్ ఎండి రేడియాలజీ, కొండేటి,యం.డి. ఆఫ్రోజ్ కొండేటి హాస్పిటల్ సీఈవో తదితరులు పాల్గొన్నారు.