ప్రొఫెసర్ కోదండరామ్ ను సన్మానిస్తున్న ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు.

ప్రొఫెసర్ కోదండరామ్ ను సన్మానిస్తున్న ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు.
జ్ఞాన తెలంగాణ సంగారెడ్డి 2.2.2024 ఎం ఎల్ సి గా నియామకం అయ్యి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టీజెస్ ,టీజె ఏ సి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ సారధి ప్రొఫెసర్ కోదండరాం గారికి నిర్వహించిన పౌర సన్మాన కార్యక్రమంలో భాగంగా ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి తరపున ప్రొఫెసర్ కోదండరాం గారికి శాలువాతో సన్మానం చేసి డా బి ఆర్ అంబేద్కర్ చిత్ర పటం బహుకరించిన ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర ఈ సందర్భగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరాం గారికి రాష్ట్ర మంత్రి వర్గం లో చోటు కల్పించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కి మరియు సూపరిపాలనకు కోదండరాం గారి సేవలను ఉపయోగించు కోవాలని అన్నారు. ఇట్టి కార్యక్రమం లో ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధ్యక్షుడు సజ్జద్ ఖాన్ ప్రధాన కార్యదర్శి అమిది పురం మహేష్ కుమార్ సహా కార్యదర్శి శ్రీకాంత్, పాండు రంగం, కార్యవర్గ సభ్యులు సాయి వరాల ,రాము కిషన్ తదితరులు. పాల్గొన్నారు.
