మాజీ వైస్ ఎం. పి. పి.కి ఆర్ధిక సహాయం అందచేత.

జ్ఞాన తెలంగాణ కేసముద్రం,
మే 29.

కల్వల గ్రామానికి చెందిన కేసముద్రం మాజీ వైస్ ఎంపీపీ మూరగుండ్ల అనంతరాములు అనారోగ్యంతో రెండు రోజుల క్రితం హన్మకొండలోని పినాకిల్ హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతుండగా బుధవారం గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ గంట సంజీవ రెడ్డి గారితో గ్రామానికి చెందిన నాయకులు అనంతరాములును పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వైద్యాఖర్చుల నిమిత్తం శ్రీ సంజీవ రెడ్డి గారు 10 వేల రూపాయలు, గ్రామస్తులు సేకరించిన విరాళాలు లక్ష రూపాయలను అనంత రాములు కుటుంబసభ్యులకు అందించి మానవత్వం చాటుకోవడం జరిగింది. గండి శ్రీనివాస్, మోడెం వెంకటేశ్వర్లు, నాయకులు చింతనూరి చిన్న వెంకన్న, సుంకరి వెంకన్న, పొడేటి దినేష్, కొంతం శరత్ పటేల్ పాల్గొన్నారు.

You may also like...

Translate »