జొన్నల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన మాజీ ఎమ్మెల్యే

జొన్నల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన మాజీ ఎమ్మెల్యే
జ్ఞాన తెలంగాణ,నారాయణఖేడ్:
నారాయణఖేడ్ మండలంలోని ర్యాకల్ గ్రామంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి గారు
మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…
ఇక్కడ గంగాపూర్ లో pacs సొసైటీ ఉన్న కానీ ఈ సొసైటీకి కొనుగోలు అనుమతి ఇవ్వకుండా సంజీవనరావుపేట్ సొసైటీకి ఇచ్చారని తెలియజేశారు. ఇక్కడ వరకు ఇచ్చుంటే వారు ప్రత్యేక చొరవ తీసుకొని వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసేవారిని తెలిపారు.
ఇక్కడ పండించిన ప్రతి ఒక్క జొన్న గింజను వదలకుండా కొనుగోలు చేసి వాటిని సకాలంలో తరలించి 24 గంటలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా చూడాలని సూచించారు.
నిన్న మేము జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ధర్నా చేస్తామని ప్రకటించగానే ఉటావుటిన రాత్రికి రాత్రి కేంద్రాలను ప్రారంభించామని ఫోటోలు పెట్టుకున్నారు. కానీ వాటికి ఎటువంటి ఆదేశాలుగాని పర్మిషన్లు గాని బార్దన్లు గాని ఇవ్వలేదని తెలిపారు. ఈరోజు ఒకరోజు చూసి రైతుల దగ్గర నుండి జొన్నలు కొనుగోలు చేయని పక్షంలో మళ్లీ ధర్నాలు ఉద్యమాలు చేయడానికి సిద్ధమవుతామని ప్రభుత్వానికి హెచ్చరించారు. అలాగే మన కాంసెన్సీ లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా గోదాములు కట్టించామని పండించిన పంటలను అందులో నిల్వ చేసుకోవచ్చని కొనుగోలు చేసిన వెంటనే వాటిని అందులోకి తరలించాలని ఈ చేతకాని దద్దమ్మ అయినటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పటివరకు వాటి గురించి అడిగిన దాఖలాలు లేవని తెలిపారు.
తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే గారికి రైతులు తమ గోషలను వివరించి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు ఎటువంటి కష్టాలు రాకుండా మా ధాన్యాన్ని తొందరగా కొనేలా చూసారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మాజీ సర్పంచ్ అంజన్న, నాయకులు గోపాల్ రెడ్డి, మల్ రెడ్డి, పండరి, తుకారం, సాయిలు, కృష్ణ, నర్సింలు, దశరథ్, జ్ఞానేశ్వర్, విఠల్, పండరి, మంగలి దశరథ్,నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు ఉన్నారు.