రామోజు రాజేశ్వర చారిని అభినందించిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి

జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్)

మలేషియాలో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీలలో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ గ్రామ వాసి రామోజు రాజేశ్వర చారి బంగారు పతకం సాధించిన సందర్భంగా మహేశ్వర మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అభినందించారు. ఈనెల 10, 11, 12 మూడు రోజులు మలేషియాలో జరిగిన కరాటే పోటీలలో దాదాపు 16 మెడల్స్ రావడం జరిగింది.అందులో బాలాపూర్ గ్రామ వాసి బంగారు పథకం గెలుచుకోవడం జరిగింది.
మహేశ్వరం నియోజవర్గం మీర్పేట్ లోని తీగల కృష్ణ రెడ్డి క్యాంపు కార్యాలయంలో బంగారు పతకం సాధించిన రాజేశ్వర చారి కి తీగల కృష్ణారెడ్డి సన్మానించారు.ఈ సందర్భంగా తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలని మంచి ప్రతిభ కనబరిచిన వారికి ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందే విధంగా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో కోచ్ సంపత్ కుమార్ టీమ్ మెంబర్స్ కళ్యాణ్ మోహన్, బీసీ ఫెడరేషన్ కులాల మహేశ్వరం ఇంచార్జ్ వజ్రోజు రవీంద్ర చారి, స్వర్ణకార సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మణ చారి తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »