ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు


జ్ఞానతెలంగాణ కొడకండ్ల:
ఈరోజు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పాలకుర్తి నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వేములవాడ కాంటెస్ట్ ఎమ్మెల్యే చల్మెడ లక్ష్మీనరసింహారావు. కాంగ్రెస్ మోసపూరిత మాటలు వినే ఇప్పటికే ప్రజలు మోసపోయారు, కానీ రానున్న గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో అందరూ గ్రాడ్యుయేట్స్ కూడా ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఎన్నికలు ఒక బ్లాక్ మెయిల్ కి ఒక విద్యావంతుడికి మధ్య జరుగుతున్న పోటీ, సోషల్ మీడియా వేదిక చేసుకొని తాను ఒక ప్రశ్నించే గొంతుకు అని చెప్పి ప్రజల్లోకి వెళ్లిన వ్యక్తి అదే సోషల్ మీడియా ని అడ్డుపెట్టుకొని జోరుగా బ్లాక్మెయిల్ దందాలు చేసి డబ్బులు వసూలు చేస్తున్నాడు అని ప్రచారం చేసి పట్టభద్రులందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు సిందే రామోజీ, మార్కెట్ చైర్మన్ పేరు రాము, మండల ఇన్చార్జి జెడ్పి ఫ్లోర్ లీడర్ పాలకుర్తి జడ్పిటిసి పుస్కూరి శ్రీనివాస్,ఎంపీపీ దావత్ జ్యోతి, గాంధీ నాయక్, మేటి సోమరాములు, దీకొండ వెంకటేశ్వరరావు, గ్రామాల ఇన్చార్జులు సత్యనారాయణ, ఎండి ఆసిఫ్, వెంకట్ నారాయణ, ప్రేమ్ కుమార్, రాజిరెడ్డి, సతీష్, హరీష్, శన్నా, తదితరులు పాల్గొనడం జరిగింద

You may also like...

Translate »