మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి.


జ్ఞాన తెలంగాణ,కొడకండ్ల: కొడకండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన మేటి రాములు గారి ఇద్దరి కుమారులు శివ శ్రవణ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా వారి విషయం ని తెలుసుకొని ఈరోజు మన ప్రియతమ నాయకుడు మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు వారి యొక్క చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించడం జరిగింది. దయన్న గారి వెంట మండల పార్టీ అధ్యక్షులు సింధె రామోజీ, ఎంపీటీసీ చెంచు మణెమ్మ- రాజిరెడ్డి, ఎఫ్ ఎస్ సి ఎస్ వైస్ చైర్మన్ మేటి సోమరాములు, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎండి యాకూబ్, పాలకుర్తి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేశ గాని సతీష్ గౌడ్, నాయకులు ఎం నరసింహస్వామి, కె నవీన్, కే సురేష్, ఏ భూపాల్, కె శీను, ఎం యాకన్న, కే మహేష్, పరుశురాములు, ఎం శ్రీధర్, పీ ప్రవీణ్, తదితరులు పాల్గొని వారి కుటుంబానికి భగవంతుడు ఎల్లవేళలా ధైర్యంగా ఉండి వారిని ముందుకు నడిపించవలసిందిగా ప్రార్థించడం జరిగింది.

You may also like...

Translate »