నూతనంగా ఎన్నికైన బిజెపి మండల, మున్సిపల్ అధ్యక్షులను సన్మానించిన చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కే ఎస్ రత్నం

నూతనంగా ఎన్నికైన బిజెపి మండల, మున్సిపల్ అధ్యక్షులను సన్మానించిన చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కే ఎస్ రత్నం


జ్ఞాన తెలంగాణ ,శంకర్‌పల్లి :

శంకర్‌పల్లి మండల, మున్సిపల్ బిజెపి అధ్యక్షులుగా లీలావతి బయానంద్, దయాకర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యుడుగా వాసుదేవ్ కన్నా ఎన్నికయ్యారు. బుధవారం మండల పరిధిలోని దొంతాన్ పల్లి గ్రామ శివారులో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో వారు స్వామికి ప్రత్యేక పూజలు చేసి, స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం వారిని సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండల, మున్సిపల్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

You may also like...

Translate »