ఉస్సేన్ సాగర్ జలాలపై ….. గబ్బిలాల విహారం

జ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్) హుస్సేన్ సాగర్ అన్నా హుస్సేన్ సాగర్ పరిసరాలు నిత్యం పర్యాటకులతో సందర్శకులతో అక్కడి ప్రజలతో నిత్యం కిటకిట లాడే ప్రాంతాలు . హైదరాబాద్ ప్రజలు కూడా నిత్యం లక్షలాదిమంది సాయంత్రం వేళ ఆటవిడుపు కోసం హుసేన్ సాగర్ పరిసరాలకి వచ్చి అక్కడి ప్రాంతాలను చూస్సి తమ తన్మయత్వాన్ని పొందుతారు. ఆ పరిసరాల్లో ట్యాంక్బండ్ అదేవిధంగా ఎన్టీఆర్ గార్డెన్ బీర్ల టెంపుల్ సచివాలయం అమరవీరుల స్తూపం నక్లెస్ రోడ్ జలవిహార్ అంబేద్కర్ స్టాచ్యూ ఐమాక్స్ థియేటర్ ఇవన్నీ కూడా సందర్శికులతో నిత్యం జన సమర్థంతో ఉండే ప్రాంతాలు. ఇది ఏ కార్యక్రమం ఏ సభలో ఏ సమావేశాలు ఉన్నప్పుడే కాదు నిత్యం ఈ ప్రాంతాల్లో సందర్శకుల తోటి గజిబిజిగా ఉండే ప్రాంతాలు. ఇలాంటి ప్రాంతాలు ఎంతో పర్యావరణంతో చూడ ముచ్చటైన విగ్రహాలతో పచ్చని చెట్లతో సందర్శకులు నాకట్టుకునే ప్రాంతాలు. ఇవన్నీ కూడా సందర్శనీయ ప్రాంతాలే దీనికి తోడు వివిధ ప్రాంతాలకు వెళ్లే వారితో వాహనదారులతో ఎంతో గజిబిజిగా ఉండే అటువంటి ప్రాంతం సాయంత్రం వేళల్లో సందర్శకులు ఆటవిడుపు కోసం ఈ ప్రాంతాలకు లక్షలాదిగా పర్యాటకులు కూడా అదే తీరులో ఈ ప్రాంతానికి వచ్చి పోతుంటారు.

రాష్ట్ర సచివాలయం అంబేద్కర్ విగ్రహంతో మరింత రద్దీగా మారిన ప్రాంతం

తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే ప్రాంతంలో ఎన్టీఆర్ గార్డెన్ పక్కన పెద్ద ఎత్తున రాష్ట్ర సచివాలయ నిర్మాణం చేపట్టారు పాలరాతి భవనంతో ఎంత అద్భుతమైనటువంటి ఈ భవనం చూపరులను ఆకట్టుకుంటుంది కెసిఆర్ నిర్మించిన ఈ రాష్ట్ర సచివాలయ భవనం ఎంతో విశాలంగా దర్శినియస్థలంగా పర్యాటక ప్రాంతంగా రాబోయే రోజుల్లో మారనుంది దానికి ఎదురుగా అమరవీరుల స్తూపం ఎంతో అత్యద్భుతమైనటువంటి భవనంగా దీక్షిత్దిద్దారు వీటి కోసం నిత్యం సందర్శకులు వేల సంఖ్యలో వచ్చి అక్కడ ఫోటోలు దిగి సెల్ఫీలు దిగుతున్నారు. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం అతిపెద్దదైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఐమాక్స్ థియేటర్ పక్కన ఏర్పాటు చేశారు గతంలోని బుద్ధ విగ్రహం ట్యాంక బండ్ పై ఉన్న విగ్రహాలను చూడడానికి లక్షలాది జనం రాకపోకలు సాగిస్తారు. మరి ఇప్పుడు దేశంలోనే అతిపెద్దదైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడంతో జనసంఖ్య మరింత పెరిగింది. ఓవైపు బుద్ధ విగ్రహం మరోవైపు ట్యాంక్బండ్ మరోవైపు హుస్సేన్ సాగర్ అందాలు మరోవైపు జలవిహార్ ఎన్టీఆర్ గార్డెన్ టైగర్ ప్రాంతాలతోటి నిత్యం జనం కిటకిటలాడుతుండే ప్రాంతాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటుచేసిన ఈ భవనాలు ఈ విగ్రహాలతో మరింత జన సమర్థంగా ఉండే ప్రాంతాలుగా మారాయి.

హుస్సేన్ సాగర్ అలలపై గబ్బిలాల విహారం

నిత్యం సందర్శకులతో ప్రజలతో సామాన్య జనంతో గజిబిజిగా ఉండే ఈ ప్రాంతంలో సాయంత్రమైతే చాలు హుస్సేన్ సాగర్ అలలపై ఎన్టీఆర్ గార్డెన్ చెట్ల నుంచి రోడ్డుకిరు వైపులా ఏర్పాటు చేసిన వృక్షాలపై గబ్బిలాలు పెద్ద ఎత్తున సంచరిస్తూ హుస్సేన్ సాగర్ అలలపై వీర విహారం చేస్తున్నాయి వీటివల్ల ప్రజారోగ్యంపై ఏమైనా ప్రభావం చూపనుందా అనేది ఆలోచించాల్సిన విషయం వంటికి రెంటికి గాలిలోనే చేయడం చెట్ల కింద సాగర్లో చేయడం వల్ల ఈ గాలిలో ఏర్పడి ప్రజారోగ్యంపై ఏమైనా ప్రభావం చూపనుందా అనేది ఆలోచించాల్సినటువంటి విషయం. ఏది ఏమైనా గబ్బిలాల సంచారం లేకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

You may also like...

Translate »