అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
జ్ఞాన తెలంగాణ, నాగర్ కర్నూల్

అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
- బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్
ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైనా చిరు వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలని నాగర్ కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.నాగర్ కర్నూల్ పట్టణంలోని శ్రీపురం చౌరస్తాలోని గత రాత్రి జరిగిన ప్రమాద స్థలాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. బాధితులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైన చిరు వ్యాపారుల దుకాణాల సముదాయాలను పరిశీలించిన అనంతరం బాధితులకు భరోసా కల్పిస్తూ,ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.తక్షణమే ప్రభుత్వం ఆస్తి నష్టాన్ని అంచనా వేసి, బాధితులకు నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు.

ప్రమాదంలో దగ్ధమైపోయిన సామాగ్రి

దగ్ధమైపోయిన షాపులు