బోడంపహాడ్ రైతు వేదిక దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం

బోడంపహాడ్ రైతు వేదిక దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం


జ్ఞాన తెలంగాణ,షాబాద్,మార్చి 13:

షాబాద్ మండల పరిధిలోని బోడంపహాడ్ గ్రామంలోని రైతువేదిక దగ్గర అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఎదురెదురు బైకులపై వచ్చి ఢీ కొట్టుకొనడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలలోకి వెళితే షాబాద్ సి ఐ కాంతా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… బోడంపహాడ్ గ్రామానికి చెందిన మొగలిగిద్ద సుధాకర్, కొత్తపల్లి బాలయ్య బైక్ పై ఇంటికి వెళ్తున్నారు. అదే గ్రామానికి చెందిన రజనీకాంత్ తన వాహనంపై వెళ్తున్న క్రమంలో రెండు ద్విచక్ర వాహనదారులు అదే గ్రామ సరిహద్దులోని రైతు వేదిక వద్ద ఎదురెదురుగా ఢీ కొట్టుకోవడంతో సుధాకర్, రజనీకాంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని అంబులెన్స్ లో షాద్నగర్ ఆసుపత్రికి తరలించారు. పరిగి డిపోలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్న సుధాకర్ చికిత్స పొందుతూ మరణించాడు. బాలయ్య స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతునికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

You may also like...

Translate »