వ్యవసాయ అధికారులకు రైతులు సహకరించాలి : ఎస్ఐ ఎం.రవీందర్

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 21 : ఎరువుల పంపిణీ సమయంలో వ్యవసాయ అధికారులకు రైతులు సహకరించాలని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ సూచించారు. గురువారం కట్టంగూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని సందర్శించి సమస్యలను రైతులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాస్బుక్ కలిగి ఉన్న రైతులకు సీరియల్ ప్రకారం ఎరువులు అందజేస్తారని, యూరియా దొరకని రైతులకు మళ్లీ రాగానే పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. నానో యూలియాను వాడి భూసారాన్ని పెంపొందించుకోవాలని రైతులకు వ్యవసాయ అధికారులతో కలిసి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల స్పెషల్ ఆపీసర్ (జీఎం ఇండ్రస్ట్రీస్) సతీష్, ఏఓ గిరి ప్రసాద్, సీఈఓ బండ మల్లారెడ్డి, సిబ్బంది కాడింగ్ సైదులు, చెరుకు చంద్రయ్య, రాంబాబు, సైదులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
