నకిలీ విత్తనాల విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలి

రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుంచి తప్పక రసీదు తీసుకోవాలి.

జిల్లా వ్యవసాయ అధికారుల అవగాహన కార్యక్రమం

జ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్) రైతులు నకిలీ విత్తనాల విషయంలో తగు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా వ్యవసాయ అధికారులు తెలిపారు. సోమవారం రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన కొనుగోలులో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి పరిధి క్లస్టర్ పరిధిలో రెండు నుంచి మూడు గ్రామాల పంచాయతీల్లో ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు వారం రోజులు అన్ని గ్రామాల్లో షెడ్యూల్ ప్రకారం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ అవగాహన కార్యక్రమంలో ముఖ్యంగా విత్తన కొనుగోళ్లలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. లూజుగా ఉన్న సంచుల్లో ఉన్న విత్తనాలు కొనుగోలు చేయరాదని రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుంచి రషీద్ను తప్పగా తీసుకోవాలని విత్తన ప్యాకెట్ మరియు బిల్లులు భద్రంగా దాచుకోవాలన్నారు వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధికృత డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. నకిలీ విత్తనాల అరికట్టుటకు మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ వ్యవసాయ అధికారి పోలీస్ శాఖ సమన్వయంతో జిల్లా స్థాయిలో ఇంటర్ డివిజనల్ లెవెల్ డివిజనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈరోజు జరిగిన విత్తన కొనుగోలు అవగాహన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గీత మొయినాబాద్ మండల అపోజిగూడ గ్రామం నందు శంకరపల్లి మండలం మహాలింగాపూర్ లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చేవెళ్ల వ్యవసాయ సంచాలకులు మొయినాబాద్ చేవెళ్ల మండల వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

You may also like...

Translate »