విద్యుత్ షాక్‌తో రైతు మృతి

జ్ఞాన తెలంగాణ,నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 10:

నాగిరెడ్డిపేట్ మండలంలోని లింగంపల్లి కలాన్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అల్లపురం లింగయ్య (59) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు.ఉదయం సుమారు 6 గంటల సమయంలో తన పొలం వద్ద వరి తుకానికి నీరు పారించే పనిలో నిమగ్నమయ్యాడు. పందుల నుంచి పంటను రక్షించేందుకు పొలాన్ని చుట్టూ ఏర్పాటు చేసిన జీవ వైరు వద్దకు వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా కరెంట్ ప్రసారం కావడంతో లింగయ్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు.గ్రామస్తుల సమాచారంతో కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి చేరుకుని లింగయ్య మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ భార్గవ్ గౌడ్ తెలిపారు.మరణించిన లింగయ్యకు భార్య లక్ష్మవ్వతో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

You may also like...

Translate »