పొన్నం ప్రభాకర్ గౌడ్ పై అసత్యపు ఆరోపణలు మానుకోవాలి

పొన్నం ప్రభాకర్ గౌడ్ పై అసత్యపు ఆరోపణలు మానుకోవాలి
జై గౌడ్ ఉద్యమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
-వేముల మహేందర్ గౌడ్
జ్ఞానతెలంగాణ, చిట్యాల, జూన్ 10:
తెలంగాణ ఉద్యమ నాయకులు, గౌడజాతి ముద్దుబిడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న తెలంగాణ ద్రోహి హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి తగిన గుణపాఠం తప్పదని జై గౌడ్ ఉద్యమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల మహేందర్ గౌడ్ హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఒక బీసీ ముద్దుబిడ్డ రాజకీయంగా ఎదుగుతుంటే చూసి ఓర్వలేని అగ్రకులానికి చెందిన కౌశిక్ రెడ్డి పొన్నం ప్రభాకర్ గౌడ్ పై నిందలు వేయడం తగదన్నారు మరోసారి కౌశిక్ రెడ్డి పొన్నం ప్రభాకర్ పై తప్పుడు కూతలు కూస్తే యావత్ తెలంగాణ గౌడ సమాజం చూస్తూ ఊరుకోబోదని, తెలంగాణలో కౌశిక్ రెడ్డిని ఎక్కడ తిరగకుండా తరిమి కొడతామని మహేందర్ గౌడ్ హెచ్చరించారు.