కరీంనగర్ శ్వేతా హోటల్లో ఎక్స్పైర్ అయినా ఫుడ్ ఐటమ్స్..

తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల వరుస దాడులు హోటల్స్, రెస్టారెంట్ యజమాన్యంలో దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాదులోని పలు రెస్టారెంట్లలో తనకి నిర్వహించారు.

చాలావరకు హోటళ్లలో పరిశుభ్రత పాటించకపోవడం. గడువు తీరిన ఆహారపార్థాలు విక్రయించడం వంటివి గుర్తించినట్టు అధికారులు తెలిపారు. అయితే స్ట్రీట్ ఫుడ్ సెంటర్ లోనే కాదు బడబడ రెస్టారెంట్లలోనూ ఇలాంటి సంఘటనలు గుర్తించడం ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తుంది.

ఇక తాజాగా కరీంనగర్ లోను ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ కరీంనగర్ లోని శ్వేతా హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు ఈ సోదాల్లో అధికారులు కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించారు. అలాగే వంటల్లో గడువు తీరిన పదార్థాలు ఉపయోగిస్తున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఈ తనిఖీలకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పలు అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు ఆకస్మికంగా చేసిన దాడులతో… ఒక్కసారిగా హోటల్స్ ఎజమాన్యాలు బెంబలెత్తగా… హోటల్ లో నిష్టూరమైన నిజాలు బయటపడ్డాయి. మిరియాల పేరుతో పుప్పడి గింజలను వేస్తున్నట్లు గుర్తించారు. 2021- 22 సమయంలోని ఇన్ గ్రేడియంట్స్ ను మసాలాలుగా వాడుతుండడంపై అధికారులు నిశ్చేష్టులయ్యారు.

ఇదంతా ఓ ప్రముఖ స్టార్ హోటల్లో బట్టబయలైంది. మొత్తం కల్తీ నూనెలు కాలం చెల్లిన వంట సామాన్లు, మసాలా దినుసులను గుర్తించిన అధికారులు హోటల్ యాజమాన్యాలకు నోటీసులు అందించినట్లు తెలిపారు. మరి నీ హోటల్స్ లో కూడా సాయంత్రం వరకు ఈ తనిఖీలు జరుగుతాయని ఫుడ్ సేఫ్టీ యాక్ట్స్ ప్రాకారం. చర్యలు కూడా ఉంటాయని అమృత శ్రీతెలిపారు.

You may also like...

Translate »