తెలంగాణలో అంతర్జాతీయ ఫోరెన్సిక్ సెంటర్ ఏర్పాటు:మంత్రి శ్రీధర్ బాబు.

తెలంగాణలో అంతర్జాతీయ ఫోరెన్సిక్ సెంటర్ ఏర్పాటు:మంత్రి శ్రీధర్ బాబు.

హైదరాబాద్ జనవరి 24: తెలంగాణలో మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ముందు కొచ్చింది డిజిటల్ ఫోరెన్సిక్ డేటా రికవరీలో దిగ్గజ కంపెనీ అయిన రష్యాకు చెందిన ఏఈసి ల్యాబ్ జూమ్ టెక్నాలజీస్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.హైదరాబాద్‌లో అత్యాధునిక ఫోరెన్సిక్ సెంటర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఏసీఈ లాబ్ సీఓఓ మ్యాక్స్ పుతివ్ సేవ్ జూమ్ టెక్నాలజీస్ సీఓఓ తోపాటు ఆ సంస్థల ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు.తాము ఏర్పాటు చేయబోతున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రతిపాదనలపై మంత్రికి వివరించారు

ప్రభుత్వపరంగా కావాల్సిన సహాయ సహకారాల గురించి వారు చర్చించారు.129 దేశాల్లో తమ సంస్థ కార్యకలాపాలు ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబకు సంస్థ ప్రతినిధులు తెలిపారు సైబర్ సెక్యూరిటీ రంగంలో ఆయా దేశాల దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్న అనుభవం తమకు ఉందని వివరించారు.డేటా లాస్ డిజిటల్ ఇన్వెస్టిగేషన్ సవాళ్లను అధిగమించడానికి భారతీయ వ్యాపారాలు బ్యాంకులు ప్రభుత్వ సంస్థలు దర్యాప్తు సంస్థలకు తాము సహకరిస్తామని స్పష్టం చేశారు.ప్రత్యేకమైన సాంకేతికతతో ఉన్నత స్థాయి నైపుణ్యాలు కలిగిన సాంకేతిక నిపుణులతో ఆయా సంస్థలకు తాము వృత్తిపరమైన శిక్షణ ఇవ్వడంలో నిష్ణార్ధులమని తెలిపారు.

You may also like...

Translate »