ఉపాధి మార్గదర్శకుడు.మాజీ మంత్రి కేటీఆర్

  • మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్
  • షాద్ నగర్ ఘనంగా మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు
  • సర్కార్ దావాఖానలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ
  • పార్టీ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు
  • జానంపేట భవాని మాత దేవాలయంలో ప్రత్యేక పూజలు
  • సోలిపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జన్మదిన కానుకల పంపిణీ
  • జన్మదిన వేడుకలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు

    జ్ఞాన తెలంగాణ,షాద్ నగర్, రంగారెడ్డి జిల్లా,జూలై 24:

స్వరాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంతో పాటు ఉపాధి రంగానికి మార్గదర్శకులుగా నిలిచిన గొప్ప మేధావి, ఉపాధి సృష్టికర్త మాజీ మంత్రి కేటీఆర్ అని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ కొనియాడారు. గురువారం షాద్ నగర్ పట్టణంలోని సర్కార్ దవాఖాన ఆవరణలో నిర్వహించిన మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఆయన పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉండేదని, స్వరాష్ట్రం సాధించుకున్న అనంతరం, మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో మాజీ మంత్రి కేటీఆర్ ఎన్నో పరిశ్రమలకు పురుడు పోసి వేలాది మంది యువతకు ఉపాధిని కల్పించిన ఘనుడని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశంలోనే హైదరాబాద్ ఐటీ రంగంలో మొదటి స్థానంలో నిలిచిందంటే అందుకు ప్రధానకారకులు కేటీఆర్ అనే విషయం ప్రతి ఐటీ నిపుణుడికి తెలుసని చెప్పారు. పార్టీ శ్రేణులను సైతం ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ ప్రజల పక్షాన నిలుస్తున్నారని చెప్పారు. కేటీఆర్ ఇలాంటి వ్యక్తి తెలంగాణ ప్రజలకు ఎంతో అవసరమని, ఆయన పనితీరు నేటితరం యువతకు, రాజకీయ నాయకులకు ఆదర్శనీయమని కొనియాడారు. ఇందులో భాగంగానే సర్కారు దవాఖానాలో రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. దవఖాన ఆవరణలో పార్టీ శ్రేణుల మధ్య కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. జానంపేట భవాని మాత దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సోలిపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జన్మదిన కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ నరేందర్, బీఆర్ఎస్ అధ్యక్షులు నటరాజ్, లక్ష్మణ్ నాయక్, ప్రధాన కార్యదర్శులు వీరేశం, రవి యాదవ్, సీనియర్ నాయకులు కడెంపెల్లి శ్రీనివాస్ గౌడ్, నక్కల వెంకటేష్ గౌడ్, మన్నె నారాయణ, లక్ష్మీనరసింహా రెడ్డి, జిల్లెల వెంకటరెడ్డి, ఎమ్మె సత్యనారాయణ, వెంకట్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు.ఎం.డి మహమూద్ బీఆర్ఎస్ శ్రేణులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

You may also like...

Translate »