జోరుగా సాగుతున్న ఉపాధి హామీ పనులు

జోరుగా సాగుతున్న ఉపాధి హామీ పనులు
జ్ఞాన తెలంగాణ //కొండాపూర్ // అనంతసాగర్ //మే 28.
మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయి.
అనంతసాగర్ గ్రామంలో వర్షాకాలం సమీపించడంతో నీటిని నిల్వ ఉంచేందుకు చెరువులో నీటి సామర్థ్యం పెంచేందుకు ఉపాధి హామీ ద్వారా ఇంకుడు గుంతలను తీస్తున్నారు.
మారేపల్లి, అనంతసాగర్, సైదాపూర్, తొగర్ పల్లి, అలియాబాద్, ముని దేవునిపల్లి టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ… ఉపాధి హామీ కూలీలకు నీటి సౌకర్యం, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందజేస్తున్నామని తెలియజేశారు.
ఉపాధి కూలీలు ప్రతి ఒక్కరూ కొలతలకు తగ్గట్టుగా పనిచేయాలని సూచించారు.
కొలతలకు తగ్గట్టుగా పనిచేస్తే ప్రతిరోజు 300 రూపాయలు పొందవచ్చని తెలియజేశారు.
ఆయా గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు NMMS ద్వారా 100% హాజరును నమోదు చేయాలని తెలియజేశారు.
ఉపాధి హామీ పనులలో నిర్లక్ష్యం వహిస్తే పై అధికారులకు తెలియజేసి తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనారోగ్యంతో ఉన్నవారిని గుర్తించి వారిని పనిలోకి రాని వద్దని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా కొండాపూర్ మండలు ఆయా గ్రామాల టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్, అనంతసాగర్ ఫీల్డ్ అసిస్టెంట్ అనిత మరియు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు
