కుల మతాలకు అతీతంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.

కుల మతాలకు అతీతంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.
ఏవైయస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య
జ్ఞానతెలంగాణ, చిట్యాల, మే 11:
మన దేశ ,రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కార్యక్రమం తో పాటు ఎన్నికలలో గెలిచిన ప్రజాప్రతినిధులు మరియు ముఖ్యమంత్రి , ప్రధాన మంత్రి భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం పై నాటి నుండి నేటి వరకు ప్రమానం చేసి పరిపాలనను కొనసాగించారని, రేపు జరిగే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామనడం సరియైనది కాదని తెలంగాణా రాష్ట్ర అంబెడ్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య అన్నారు.
శనివారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అద్యక్షతన సంఘం సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రపంచ మేధావి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని విద్యార్థి దశలో ఉన్నప్పుడు అన్ని అవమానాలు ఎదుర్కొని పట్టుదలతో ఉన్నత చదువులు చదివి భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధావి అన్నారు. దళితులలో చైతన్యం తీసుకు రావడానికి ఎంతో క్రృషి చేశారని చెప్పారు భారత రాజ్యాంగంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ కుల మతాలకు అతీతంగా ఓటు హక్కు కల్పించారని ఆ ఓటు చాలా విలువైనది. ఆ నిర్ణయం అందరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అదే ఓటు తో గెలిచి రాజ్యాంగాన్ని మారుస్తామని మాట్లాడడం సిగ్గు చేటన్నారు. రాజ్యాంగాన్ని మార్చితే దళితులు బానిసత్వం తో అవమానాలు ఎదుర్కొనవలసి వస్తుంది అని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చడం కాదు సవరణలు చేయాలని కోరారు .మన భారత దేశంలో ప్రజలు మహిళలు యువకులు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు బడుగు బలహీన వర్గాలైన ఎస్సి, ఎస్టీ ,బిసి , మైనార్టీ కులాలు కుల మతాలకు అతీతంగా ముందుకు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సాంస్కృతిక కార్యాదర్శి జన్నే యుగేందర్ మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ మండల ప్రధాన కార్యదర్శి మ్యాదారి సునీల్ తదితరులు పాల్గొన్నారు
