పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు.

పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు.
–ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్.
ఫోటో.సామాగ్రి పంపిణీ కేంద్రం వద్ద సూచనలిస్తున్న ఆర్డీఓ.
జ్ఞాన తెలం – బోధన్
బోధన్ నియోజకవర్గంలో పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు బోధన్ ఆర్డీఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అంబదాస్ రాజేశ్వర్ తెలిపారు. ఆదివారం బోధన్ విజయమేరి హైస్కూల్ లో ఎన్నికల సామాగ్రి కేంద్రాన్ని పరిశీలించారు.ఈ సంధర్బంగ ఎన్నికల విధులలో పాల్గొన్న సిబ్బందికి పలు సూచనలు అందించారు.బోధన్ నియోజకవర్గంలో 246 పోలీంగ్ స్టేషన్ లలో 24 సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్ కు సెక్టోరియల్ అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు.అలాగే 1200 మంది ఉద్యోగులు ఎన్నికల వెధులలో పాల్గొంటున్నారని తెలిపారు.సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓట్టింగ్ నిర్వహించడం జరుగుతుందని ,ఓటర్లు ఓటు వేయడానికి 13 రకాల గుర్తింపు కార్డులను ఉపయోగించుకోవచ్చని తెలిపారు.నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 23 వేల906 మంది ఓటర్లు ఉన్నారని ప్రతి ఓటరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అనంతరం ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి సామాగ్రి పంపిణీ చేశారు.కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, తహశ