Badging Ceremony ” లో పాల్గొన్న దుబ్బాక శాసనసభ్యులు:

జ్ఞాన తెలంగాణ దుబ్బాక :
దుబ్బాక నియోజకవర్గంలోని ఏరియా హాస్పిటల్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్తప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ కార్పోరేట్ ఆసుపత్రి తరహాలో ఇంతమంది స్టాఫ్ తో అన్ని వసతులు కలిగిన దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి పేరు పొందిన డాక్టర్ ఉండడం చాలా మంచి విషయమని,
దుబ్బాక ప్రజలందరికీ కార్పొరేట్ తరహాలో మంచి వైద్యాన్ని అందిస్తున్నామని తెలిపారు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు అందరికీ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నందుకు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇన్ని రోజులు స్టాఫ్ లేక కొంత వరకు ఇబ్బంది పడ్డాము కానీ ఇప్పుడు,
నూతన స్టాఫ్ నర్సు లుగా రిక్రూట్మెంట్ అయిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపి మీరందరూ కూడా ప్రజలకి మంచి మెరుగైన వైద్యాన్ని అందించాలని నగర వాసుల తరుపున ఒక ఎమ్మెల్యే గా కోరాతునన్నారు.
వచ్చేది వర్షాకాలం కాబట్టి అంటువ్యాధులు జలుబు దగ్గు జ్వరం ఇటువంటి వాటికి కూడా అందరూ అందుబాటులో ఉంది మెరుగైన వైద్యం అందించాలని అలాగే ప్రతినెల ఆసుపత్రి స్టాఫ్ తో రివ్వూ నిర్వహించుకుందమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో DM &HO ఆసుపత్రి సిబ్బంది స్థానిక ప్రజా ప్రతినిధులు మున్సిపల్ చైర్మన్, జెడ్పీటీసీ, ఎంపీపీ, మున్సిపల్ కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »