డ్రై ఐస్‌ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష

డ్రై ఐస్‌ విక్రయిస్తే పదేళ్లు జైలు శిక్ష

డ్రై ఐస్‌ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్‌ బిస్కెట్‌ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.

ఆహార భద్రతాశాఖ హెచ్చరిక
సడ్రై ఐస్‌ విక్రయిస్తే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ఆహార భద్రతాశాఖ హెచ్చరించింది. కర్ణాటకలో స్మోక్‌ బిస్కెట్‌ తిన్న చిన్నారి దానిని తట్టుకోలేక అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు ఆహార భద్రతా అధికారి సతీష్‌కుమార్‌ చెన్నైలో స్మోక్‌ బిస్కెట్‌ తయారు చేసే ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ… పిల్లలకు నైట్రోజన్‌ కలిసిన ఎలాంటి ఆహారపదార్థాలు ఇవ్వకూడదని తెలిపారు. హోటళ్లలో నైట్రోజన్‌ ఐస్‌ కలిపిన ఆహార పదార్థాలు విక్రయించకూడదని ఆదేశించారు. డ్రై ఐస్‌ తింటే పిల్లలకు కంటి చూపు, మాట్లాడే సామర్థ్యం తగ్గే అవకాశం ఉందని, దీనివల్ల మరణాలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు

You may also like...

Translate »